ఇటీవల జరిగిన ఎన్నికల విజయాలపై అభినందించిన ముఖ్యమంత్రి.. పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే జోష్ కొనసాగిస్తామని పీలా హామీ
CII భాగస్వామ్య సదస్సుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి శ్రీ పీలా గోవింద సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన GVMC, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
దీనికి స్పందించిన పీలా గోవింద సత్యనారాయణ ఈ నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహం, వేగం, ఎంపీ మరియు MLA గార్ల సమన్వయంతో ముందుకు సాగి కూటమి అభ్యర్థులు ఘన విజయాలు సాధించేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.


0 Comments