జనసేన అధినేత , గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆత్మీయ భేటీ.. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన సీఐఐ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్


విశాఖపట్నం: జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన సీఐఐ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారితో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆప్యాయంగా ఫోటో దిగారు.


జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, పార్టీ నాయకుడిగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆయనతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అధినేతతో ఆత్మీయ అనుబంధం.. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం.. జనసేన ప్రస్థానంలో మరో మధుర క్షణం!.. కార్యక్రమంలో గౌరవ పెద్దలు శ్రీ ప్రశాంత్ గారు పాల్గొన్నారు....

Post a Comment

0 Comments