హిందీ విభాగ జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

 


ఆంధ్ర విశ్వవిద్యాలయం, హిందీ విభాగం మరియు కేంద్రీయ హిందీ సంస్థాన్, ఆగ్రా సంయుక్త ఆధ్వర్యంలో 2026 డిసెంబర్ 22, 23 తేదీలలో "హిందీ మరియు తెలుగు సాహిత్యంలో సామాజిక యథార్థం" అనే అంశంపై నిర్వహించనున్న రెండురోజుల జాతీయ సదస్సు పోస్టర్ను ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ గారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో హిందీ విభాగాధ్యక్షులు ఆచార్య నల్లా సత్యనారాయణగారు, హిందీ పాఠ్యపుస్తక సమితి అధ్యక్షులు జార్రా అప్పారావుగారు మరియు డా. వేడంగి సరోజిని, డా. ఎస్. జగదీష్, డా.కే. సువర్ణ, డా. కే. సుగుణ, డా. షేక్ రహిమ, షేక్ మిన్నల్ల హుస్సేన్ పాల్గొన్నారు. ఈ జాతీయ సదస్సు భాషా సాహిత్య వికాసానికి, పరిశోధనాత్మక ఆలోచనలకు, హిందీ మరియు తెలుగు భాషా సాహిత్యాల మధ్య పరస్పర సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆచార్య నల్లా సత్యనారాయణగారు తెలిపారు.


 అదేవిధంగా డిసెంబర్ 23 తేదీన ఆచార్య పి. ఆదేశ్వరరావు గారి జన్మదిన్నాన్ని పురస్కరించుకొని ఎండోమెంట్ లెక్చర్ కార్యక్రమం జరుగుతుందని తెలియజేసారు. ఈ సందర్భంగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం హిందీ దివస్ కార్యక్రమం జరుపుకొనుటకు లక్ష రూపాయల డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చే వడ్డీని హిందీ దివస్ కార్యక్రమ ఖర్చుల నిమిత్తం వినియోగించుటకు  వినియోగించాలని చెప్పడం జరిగింది. 


ఈ జాతీయ సదస్సులో అధ్యాపకులు, పరిశోధకులు, సాహితీవేత్తలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జాతీయ సదస్సు నిర్వాహకులు హిందీ విభాగాధ్యక్షులు ఆచార్య నల్లా సత్యనారాయణగారు కోరారు.

Post a Comment

0 Comments