​సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఆస్ట్రేలియా మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్


సింహాచలం తేదీ 13 నవంబర్ 2026 : ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ, సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ మోహన్ యెల్లిశెట్టి  నేడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.

​

ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు  సాదర స్వాగతం పలికారు. ముందుగా ఆయన స్వామివారి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, అనంతరం శ్రీ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

​దర్శనానంతరం ఆలయ వేద పండితులు వీరికి వేదాశీర్వచనం అందజేశారు. తదుపరి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు  ప్రొఫెసర్ మోహన్ యెల్లిశెట్టి కి శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను మరియు జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

Post a Comment

0 Comments