​శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న సుమితోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారి.


సింహాచలం 13 నవంబర్  2026.సుమితోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC గ్రూప్), ఆసియా పసిఫిక్ స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ (చైన్ పబ్లిక్ సెక్టార్) ఉన్నతాధికారి శ్రీ సత్య రామమూర్తి గారు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.


ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి  శ్రీ జల్లేపల్లి వెంకట్రావు  సాదర స్వాగతం పలికారు. ముందుగా ఆయన స్వామివారి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, అనంతరం శ్రీ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

​దర్శనానంతరం ఆలయ వేద పండితులు వీరికి వేదాశీర్వచనం అందజేశారు. తదుపరి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను మరియు జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

Post a Comment

0 Comments