సింహాచలం 14 నవంబర్ 2026 విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు-2026లో పాల్గొనేందుకు విచ్చేసిన నేపాల్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం మరియు సరఫరాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ జితేంద్ర బస్నెట్ (Mr. Jitendra Basnet) నేడు సింహాచలంలోని శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ముందుగా ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, తదుపరి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు జితేంద్ర బస్నెట్ గారిని స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించి, స్వామివారి ప్రసాదాలను మరియు జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
0 Comments