జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,


విశాఖపట్నం:రాష్ట్రస్థాయి వర్క్ షాప్‌లో విశాఖపట్నం జిల్లాకు ఎన్‌సీడీ అర్బన్ ఫాలోఅప్ సేవలు, జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాల్లో విశేష ప్రతిభ  కనపర్చినందుకు రెండు అవార్డులు లబించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026 నవంబర్ 10 నుండి 12వ తేదీ వరకు మంగళగిరి, గుంటూరు జిల్లాలో నిర్వహించిన మూడు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌లో విశాఖపట్నం జిల్లా రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకుంది.

జాతీయ అసంక్రమిత వ్యాధుల నివారణ మరియు నియంత్రణ కార్యక్రమం (NP-NCD)లో భాగంగా జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్‌సీడీ రోగుల ఫాలోఅప్ సేవల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు విశాఖపట్నం జిల్లాకు ఉత్తమ అవార్డు లభించింది. అదేవిధంగా జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (NTCP) అమలులోనూ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు, ఉత్తమ పనితీరుకు గుర్తింపుగా మరో అవార్డు లభించింది.

ఈ అవార్డులను రాష్ట్ర స్థాయి అధికారుల చేతుల మీదుగా విశాఖపట్నం జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్.బి.హారిక అందుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి. జగదీశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో ఎన్‌సీడీ కార్యక్రమాల అమలు, రోగుల నిరంతర పర్యవేక్షణ, చికిత్స అనంతర ఫాలోఅప్ సేవలు, పొగాకు నియంత్రణ కార్యక్రమాల్లో సమన్వయంతో కృషి చేసిన ఎన్‌సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్.బి.హారిక మరియు ఎన్‌సీడీ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా స్థాయిలో సాధించిన ఈ గుర్తింపు వైద్య ఆరోగ్య సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.

అలాగే రాబోయే ఎన్‌సీడీ స్క్రీనింగ్ సర్వేను జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం, లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, ప్రజలకు మెరుగైన స్క్రీనింగ్, ఫాలోఅప్ మరియు నిరంతర వైద్య సేవలు అందేలా చూడటంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్.బి.హారిక మరింత బాధ్యతతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.

ఈ విజయానికి కృషి చేసిన వైద్యాధికారులు, సిబ్బంది, ఎన్‌సీడీ బృంద సభ్యులందరికీ డీఎంహెచ్‌ఓ అభినందనలు తెలియజేశారు.

జిల్లాలో ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తూ, ఎన్‌సీడీ నియంత్రణ మరియు పొగాకు రహిత సమాజ నిర్మాణం దిశగా మరింత కృషి చేయాలని ఈరోజు ప్రోగ్రాం అధికారుల సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వరరావు వారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందచేశారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డా.లూసి, డి.ఐ.ఒ., డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ, డా.ఎన్.వి.సమత, డా.కళ్యాణి, డా.ప్రదీప్, డా.శాంతి సౌందర్య, డా.బాలాజీ, శ్రీ శశి భూషణ్, శ్రీమతి సయ్యద్ బేగం, శ్రీ జి.శ్రీనివాసరావు, శ్రీ ఎన్.మోహన్, శ్రీ విశ్వనాధం, మరియు శ్రీ బి.నాగభూషణరావు, అసిస్టెంట్ మలేరియా అధికారి వారు ఇతర ఎన్.సి.డి. సిబ్బంది పాల్గొన్నారు.  

      జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, 

               విశాఖపట్నం

Post a Comment

0 Comments