విశాఖపట్నంలో 31వ CII భాగస్వామ్య సదస్సు (Partnership Summit) ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ చేనేత కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే హ్యాండ్లూమ్ జాకెట్ను ధరించారు.
మన రాష్ట్ర సంప్రదాయ కళలు, చేనేత వారసత్వాన్ని తరతరాలకు సజీవంగా ఉంచుతున్న నేతన్నల కృషిని గౌరవిస్తూ, వారి కళకు ప్రోత్సాహం అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
తాను ధరించిన చేనేత జాకెట్ ఏ ప్రత్యేక హస్తకళకు ప్రతీకో గుర్తించగలరా? అంటూ నారా లోకేశ్ ఆసక్తికరంగా ప్రశ్నించారు.

0 Comments