ప్రదేశం: కలెక్టరేట్ మీటింగ్ హాల్, విశాఖపట్నం


విశాఖపట్నం: తేదీ: 18-11-2026జిల్లా కమ్యూనిటీ రిసోర్స్ గ్రూప్ సమావేశం : జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం లో భాగంగా కమ్యూనిటీ సిస్టం స్ట్రెంతెనింగ్ (CSS) ను బలోపేతం చేసేందుకు జిల్లా కమ్యూనిటీ రిసోర్స్ గ్రూప్  సమావేశం ఈరోజు విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయాలో నిర్వహించడం జరిగింది .

ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షత వహించారు. కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహించబడుతుంది. ప్రతీ నెల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుతుంది  .

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారు మాట్లాడుతూ, హెచ్.ఐ.వి బాధితులు, అధిక ప్రమాదం ఉన్న వర్గాలు (HRG) అయిన FSW, MSM, ట్రాన్స్ జెండర్, యువత ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే D-CRG ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. వారిపై సమాజంలో ఉన్న వివక్ష, స్టిగ్మాను తొలగించి, గౌరవప్రదంగా వైద్య సేవలు, సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను ఆదేశించారు.


సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు: 1. కళంకం & వివక్ష నివారణ:

హాస్పిటల్స్, ICTC, ART కేంద్రాల్లో కమ్యూనిటీ పట్ల వివక్ష చూపవద్దని, గోప్యత పాటించాలని నిర్ణయించారు. సిబ్బందికి అవగాహన శిక్షణ ఇవ్వాలని DM&HO ను కోరారు.

2. వైద్య సేవలు - 95-95-95 లక్ష్యం: అందరికీ హెచ్.ఐ.వి పరీక్షలు, పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే ART చికిత్స, VL పరీక్షలు 100% పూర్తి చేయాలని నిర్ణయించారు. కండోమ్, STI మందుల కొరత లేకుండా చూడాలని TI NGO లను ఆదేశించారు.

3. సంక్షేమ పథకాల అనుసంధానం: PLHIV, TG, FSW,MSM వారికి ఆధార్, రేషన్ కార్డు, పెన్షన్, హౌసింగ్, ఆరోగ్య బీమా అందేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని సివిల్ సప్లైస్, మహిళా శిశు సంక్షేమ శాఖలను కోరానున్నారు .

4. కమ్యూనిటీ సమస్యలు: ప్రతి కమ్యూనిటీ ప్రతినిధి తమ సమస్యలను నేరుగా జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేయనున్నారు . పోలీస్ వేధింపులు, ఇంటి యజమానుల సమస్య, ఉపాధి లేమి వంటి అంశాలపై సంబంధిత శాఖలతో చర్చించనున్నారు .

సమావేశంలో పాల్గొన్నవారు: లెప్ర సొసైటీ రాష్ట్ర అధికారి రాదిక , css అధికారి సుధారాణి ,  PLHIV ప్రతినిధి కనకరాజు గారు, FSW ప్రతినిధి ,  MSM ప్రతినిధి ,  ట్రాన్స్ జెండర్ ప్రతినిధి, యూత్ ప్రతినిధి, మెంబర్ సెక్రటరీ DNMO Dr . పద్మజ గారు, CPM ఉమామహేశ్వరరావు గారు, CSO బద్రీ గారు,  ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments