అమలాపురం, విశాఖ సందేశం....నా వీపు మీద చిన్నశస్త్ర చికిత్స చేయించుకోవడం వల్ల గత వారం రోజులుగా మీ అందరికీ అందుబాటులో ఉండలేకపోయానని, ఎల్లప్పుడూ మీ ఆసిస్సులు తనపై ఉండాలని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కోరారు. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాను. అతి త్వరలోనే తిరిగి మీ అందరికీ అందుబాటులోకి వచ్చి, యథావిధిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తానన్నారు. నాకు మెరుగైన వైద్య సేవలు అందించి, త్వరగా కోలుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అపోలో హాస్పిటల్స్ డాక్టర్ శాంతారావు, వైద్య సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, నా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
0 Comments