కొత్తపేట సర్పంచ్ అభ్యర్థిగా దేవపాటి వెంకటేశ్వరరావు నామినేషన్*


కొత్తపేట,విశాఖ సందేశం :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా  :కొత్తపేట పంచాయతీ అభ్యర్థిగా దేవపాటి వెంకటేశ్వరరావు  నామినేషన్ వేశారు. కొత్తపేట  అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకు వచ్చిన తనను గెలిపించాలని కొత్తపేట సర్పంచ్ అభ్యర్థి దేవపాటి వెంకటేశ్వరరావు కోరారు.ఈ సందర్భంగా దేవపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను గతంలో కొత్తపేట పంచాయితీ వార్డ్  మెంబర్ గా, మండల పరిషత్ ఎంపీటీసీగా స్థానిక ప్రజలు ఎన్నుకున్నారని ఇప్పుడు కూడా  కొత్తపేట ప్రజలు ఇచ్చిన  ప్రోత్సాహంతో తాను నామినేషన్ వేశానన్నారు.


కొత్తపేట గ్రామ పంచాయతీ  ఎంతో కాలంగా అభివృద్ధికి  ఆమడ దూరంలో ఉందని. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేవని చెప్పారు.  ఈ విషయం కొత్తపేట ప్రజలందరికీ తెలుసు అని ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమతో  తాను ఇప్పుడు బరిలోకి వచ్చాను అని తెలియజేశారు. తనకు ఓట్లు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే కొత్తపేటను అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు.

Post a Comment

0 Comments