ఘ‌నంగా ముగిసిన గ్రంధాల‌య వారోత్స‌వాలు


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, నవంబ‌ర్ 20:జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వి.ఎస్. కృష్ణ గ్రంథాలయంలో  ఈరోజు ఘ‌నంగా ముగిసాయి.  గ్రంథాలయంలోని 'ఈ-లెర్నింగ్ అండ్ బ్రౌజింగ్ సెంటర్స‌లో నిర్వ‌హించిన‌ ముగింపు కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. రాంబాబు గారు  ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు స‌ర్టిఫీకేట్ల‌ను ప్ర‌ధానం చేశారు.


డాక్టర్ వి.ఎస్. కృష్ణ గ్రంథాలయ గౌరవ గ్రంథపాలకులు (Honorary Librarian) ప్రొఫెసర్ సి.హెచ్. శ్రీనివాస రావు గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.  అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు మరియు గ్రంథాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొని, వారం రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను ఘనవిజయంగా నిర్వ‌హించారు. 

సి.హెచ్. శ్రీనివాస రావు, 

గౌరవ గ్రంథపాలకులు డాక్టర్ వి.ఎస్. కృష్ణ గ్రంథాలయం

Post a Comment

0 Comments