విశాఖపట్నం :తేది: 20.11.2026 :ఈ రోజు అనగా తేది. 20.11.2026 న గౌరవ శ్రీ ఎం.అభిషిక్త్ కిషోర్, జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన గౌరవ శ్రీమతి గొబ్బిళ్ళ విధ్యాదరి, జాయింట్ కలెక్టర్ వారి సమక్షంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి మల్టీ మెంబెర్ అప్ప్రోప్రియేట్ అథారిటీ మరియు జిల్లా స్థాయి ఎడ్వైజరీ కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ ఎం.అభిషిక్త్ కిషోర్ వారు మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని స్కానింగ్ కేంద్రములు సందర్శించి స్కానింగ్ చేసే డాక్టర్స్ యొక్క విద్యార్హతలు మరియు సెంటర్ యొక్క డాక్యుమెంట్స్ పరిశీలన చేయాలని మరియు స్కానింగ్ కేంద్రం వారు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన దరఖాస్తు ను పూర్తిగా పరిశీలించి పర్మిషన్ ఇవ్వాలని సూచించారు. 5% ఉచిత స్కాన్స్ అన్ని ప్రైవేటు స్కానింగ్ కేంద్రముల (క్లినిక్స్/ల్యాబ్లు/హాస్పిటల్స్) నందు విధిగా చేయాలని మరియు ఆ వివరాలను రిజిష్టర్ లో నమోదు చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం లో విధిగా సమర్పించాలని ఆదేశించారు మరియు లింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరమని ఈ విషయం లో అన్ని డిపార్ట్మెంట్స్ వారు సహకరించాలని సమావేశములలో పాల్గొని అవగాహన కలగచేయాలని పురుషునితో సమానంగా స్త్రీ యొక్క నిష్పత్తిని పెంచాలని కోరారు.
ఈ సమావేశంలో డా.శైలజ, గైనకాలజిస్ట్, డా.చక్రవర్తి, పిడియాట్రిక్స్, డా.వందన శశికిరణ్, రేడియోలజిస్ట్, KGH, డా.లూసీ, DIO, శ్రీ అంబేద్కర్, ఎ.సి.పి. మహిళా పోలీస్ స్టేషన్, శ్రీ కె.సదారావు, డి.పి.ఆర్.ఒ, డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ-ఎన్.హెచ్.ఎం. డెమో శ్రీ బి.నాగేశ్వర రావు గారు, డెమో విభాగ సిబ్బంది, పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

0 Comments