ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థిని బి.లక్ష్మీ శరణ్యకు డాక్టరేట్ లభించింది.

 


ఏయూ మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగం లో ఇన్ఫ్లూయెన్స్ ఆఫ్ మైక్రోప్రక్చర్ ఎవల్యూషన్ ఆన్ ద మెకానికల్ అండ్ కరీజన్ బిహేవియర్ ఆఫ్ ఏజడ్ 31 బి మెగ్నీషియం ఎల్లోయ - గ్యాస్ టుంగేస్టన్ ఆర్క్ అండ్ ఫ్రిక్షన్ స్టిర్ వెళ్లే " అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. ప్రస్తుతం ఏరోస్పేస్, రంగం లో ఈ అంశానికి అత్యంత డిమాండ్ ఉండటంతో, ఈ పరిశోధనకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ చేతుల మీదగా, వీసీ కార్యాలయం లో లక్ష్మీ శరణ్య ఈ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆచార్య కె. శ్రీనివాసరావు పర్యవేక్షణలో లక్ష్మీ శరణ్య పరిశోధనలు సాగాయి. ఈ సందర్భంగా వర్సిటీ ఉన్న--తాధికారులు, పలువురు వర్సిటీ ఆచార్యులు, పరిశోధకులు లక్ష్మీ శరణ్యకు అభినందనలు తెలియజేశారు.

Post a Comment

0 Comments