అయ్యప్ప స్వామిని దర్శించుకున్న గంట్ల శ్రీనుబాబు* *పడిపూజలో పాల్గొని భజనలతో భక్తిభావం



ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం, నవంబర్ 20:కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంవీపీ కాలనీ సెక్టార్‌-1లో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన అయ్యప్ప స్వామి పూజా మహోత్సవంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు..ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.


సీనియర్ గురుస్వామి నారా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బ్లాక్ అండ్ వైట్ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినాయకుడు, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామివార్లను గంట్ల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పడిపూజలో పాల్గొని భజన కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొనగా, స్వాములకు ప్రత్యేకంగా భిక్ష (అన్నప్రసాదం) ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో పూజా మహోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది.

Post a Comment

0 Comments