సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ – పద్మజ దంపతుల వివాహ మహోత్సవ వేడుక సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు,అభిమానులు* శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు


జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, వారి సతీమణి శ్రీమతి పద్మజ గారి వివాహ మహోత్సవం సందర్భంగా పలువురు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు మాట్లాడుతూ.. వంశీకృష్ణ శ్రీనివాస్ – పద్మజ దంపతులు అన్యోన్య దాంపత్య జీవితానికి ఆదర్శంగా నిలుస్తున్నారని,  ప్రజల అభిమానం, ఆదరణ పొందుతున్నారని కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్ల పాటు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.


ఈ సందర్భంగా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులందరికీ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీస్సులే తమకు కొండంత బలమని పేర్కొంటూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.





Post a Comment

0 Comments