విశాఖపట్నం: సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల బాటనీ విభాగాధిపతిగా, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా 36 సంవత్సరాల విశిష్ట సేవలందించిన డా. కె. మాణిక్యకుమారిని ఆమె పదవీవిరమణ సందర్భంగా కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
1991లో అధ్యాపక వృత్తిలో ప్రవేశించిన డా. కంభం మాణిక్యకుమారి బోధన, పరిశోధన, విద్యార్థి అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేశారు. బాటనీ విభాగంలో డిజిటల్ మెడిసినల్ గార్డెన్, డిజిటల్ హెర్బేరియం, ఎకో పార్క్, బయోడైవర్సిటీ పరిరక్షణ కార్యక్రమాలు, గ్రీన్ ఆడిట్ వంటి అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టారు.
డా. మాణిక్యకుమారి జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో 40 పరిశోధనా పత్రాలను ప్రచురించడంతో పాటు, పలు పుస్తకాలు, కోర్సు మెటీరియల్‌ను రచించి, సంపాదించారు. ఆమె విశిష్ట సేవలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డు, డిస్టింగ్విష్డ్ ఫ్యాకల్టీ అవార్డు తదితర అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి.
36 సంవత్సరాల సుదీర్ఘ, అంకితభావపూర్వక సేవలను పూర్తి చేసిన సందర్భంగా, కళాశాల కుటుంబం డా. మాణిక్యకుమారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి, ఆమె జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగాలని ఆకాంక్షించింది.“బోధనలో మార్గదర్శి.. బాటనీలో నిపుణురాలు.. NSSలో సేవాధికారి.. పర్యావరణ పరిరక్షణలో స్ఫూర్తిదాత.. డా. కె. మాణిక్యకుమారి



0 Comments