సోదర బంధాన్ని బలోపేతం చేస్తూ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా రక్షాబంధన్ వేడుకలు* *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, విశాఖ జిల్లా మహిళా యూత్ వింగ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మానసా డిఫెన్స్ అకాడమీలో రక్షాబంధన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు*.

 


విశాఖపట్నం,:గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో ఈ ఏడాది 14 మంది మహిళా యూత్ సభ్యులు పాల్గొని, మానసా డిఫెన్స్ అకాడమీ విద్యార్థులకు ఆత్మీయంగా రాఖీలు కట్టారు. రాఖీ బంధం ద్వారా సోదరభావం, పరస్పర ప్రేమ, సేవా స్ఫూర్తి, దేశభక్తి వంటి ఉన్నతమైన విలువలను విద్యార్థులకు తెలియజేశారు.

ఈ సందర్భంగా మానసా డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ శ్రీ రాంభీర్ సింగ్ రావత్ మాట్లాడుతూ, సోదర, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ సత్యసాయి మహిళా యూత్ సభ్యుల సేవా స్ఫూర్తిని అభినందించారు.

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపడుతున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తికి అనుగుణంగా, రక్షాబంధన్‌ను కేవలం ఒక పండుగగా కాకుండా ప్రేమ, సోదరభావం, సేవ మరియు దేశభక్తి విలువలను పంచుకునే పవిత్ర సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన మానసా డిఫెన్స్ అకాడమీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు మరియు శ్రీ సత్యసాయి మహిళా యూత్ సభ్యులకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

                  K.V.SHARMA EDITOR 

Post a Comment

0 Comments