అమలాపురం, -విశాఖ సందేసం -రాజోలు మండలం తాటిపాక గ్రామం చెందిన చంటి బాబు ప్రత్యేక ప్రతిభవంతుడైన తన కుమారుడు జీవన్ వయసు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి సభ వద్ద సదరం సర్టిఫికెట్ కోసం పిర్యాదు ఇచ్చేందుకు నిరీక్షణ చూపారులను కంటతడి పెట్టింస్తోంది.మా అబ్బాయికి పుట్టినప్పటి నుంచే మానసిక సమస్య ఉంది. గతంలో సదరం సర్టిఫికెట్ కోసం నెట్‌లో అప్లై చేశాం. అప్పట్లో మా అబ్బాయిని పరీక్షించి మెంటల్ పర్సన్ అని చెప్పారు. ఇప్పుడు సదరం సర్టిఫికెట్ కోసం నెట్‌లో కూడా అప్లై కావడం లేదని వాపోయారు. ఈ సమస్యపై కలెక్టరేట్‌కు వెళ్లాం. అక్కడి నుంచి మమ్మల్ని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడి నుంచి అమలాపురం ఆసుపత్రికి మూడుసార్లు తిరిగాం. కలెక్టరేట్‌కు కూడా మూడుసార్లు వెళ్లాం. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా మూడుసార్లు తిరిగాం.
మా ఎంపీ కార్యాలయానికి కూడా రెండుసార్లు వెళ్లాం. అక్కడ కూడా ‘అయిపోతుంది... వచ్చేస్తుంది’ అని చెప్పారు. కలెక్టరేట్ నుంచి మళ్లీ కలెక్టర్ వద్దకు వెళ్లి, అక్కడి నుంచి అమలాపురం ఆసుపత్రికి మా అబ్బాయిని తీసుకెళ్లాం. అక్కడ ప్రభుత్వ వైద్యులు మా అబ్బాయిని పరీక్షించారు. ‘సదరం సర్టిఫికెట్ వచ్చేస్తుంది. 15వ తేదీలోపు వస్తుంది’ అని చెప్పారు. మళ్లీ మా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలని, ఆ తర్వాత మళ్లీ అమలాపురం ఆసుపత్రికి వెళ్లాలని, అక్కడి నుంచి కాకినాడకు వెళ్లాలని చెబుతున్నారు. సార్, మేము ఎన్నోసార్లు తిరిగాం. మాకు ఇక తిరిగే పరిస్థితి లేదు. మీరే మా సమస్యను పరిష్కరించి, మా అబ్బాయికి సదరం సర్టిఫికెట్ వచ్చేలా పర్యవేక్షించి, వికలాంగ పెన్షన్ వచ్చేలా సహాయం చేయండి . అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ పిటిషన్ ఇవ్వాలని వచ్చాను. మా సమస్యను పరిష్కరించి, మా అబ్బాయికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.

0 Comments