చేతులు కలుపుదాం… రక్తం పంచుదాం… ప్రాణాలు కాపాడుదాం! ❤️ శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా “లిక్విడ్ లవ్” రక్తదాతల నమోదు కార్యక్రమానికి సర్వత్రా సహకరించండి*


విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని -ప్రాణాపాయ పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించి, ఒక ప్రాణాన్ని కాపాడే మహోన్నత మానవతా సేవా సంకల్పంతో శ్రీ సత్య సాయి సేవా సంస్థల – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ R. లక్ష్మణరావు గారి సూచనలమేరకు , శ్రీ సత్య సాయి జిల్లా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 నుండి 30వ తేదీ వరకు “లిక్విడ్ లవ్” రక్తదాతల నమోదు కార్యక్రమం శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా  నిర్వహిస్తున్నట్లు  శ్రీ సత్య సాయి జిల్లా  అధ్యక్షులు శ్రీ K. సత్యనారాయణమూర్తి తెలిపారు.

“రక్తం ఇవ్వండి – ఆశను నిలపండి – ప్రాణాన్ని కాపాడండి” అనే స్ఫూర్తిదాయక సందేశంతో  శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఆంధ్ర ప్రదేశ్  చేపడుతున్న ఈ కార్యక్రమంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమం ఒక సంస్థకు మాత్రమే చెందిన కార్యక్రమం కాదు; అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచి, ఆపదలో ఉన్న ఒక ప్రాణాన్ని కాపాడేందుకు సమాజమంతా కలసికట్టుగా చేపట్టే మానవ సేవా ఉద్యమం అని ఆయన పేర్కొన్నారు.

ఈ మహత్తర కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, కళాశాలలు, యువత, విద్యార్థులు, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, వివిధ సంఘాలు, సంస్థలు మరియు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు చురుకుగా పాల్గొని స్వచ్ఛంద రక్తదాతలుగా నమోదు చేసుకోవాలని కోరారు.

❤️ మీరు ఒక్కసారి నమోదు చేసుకోవడం…

❤️ అవసరమైన వేళ ఒక కుటుంబానికి ఆశను అందించవచ్చు!

❤️ ఒక ప్రాణానికి మరో అవకాశాన్ని ఇవ్వవచ్చు!

ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహచరులు, పరిచయస్తులు మరియు తమకు సంబంధించిన ప్రతి ఒక్కరితో ఈ సందేశాన్ని పంచుకుని, మరింత మందిని “లిక్విడ్ లవ్” రక్తదాతలుగా నమోదు చేయించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్మార్ట్‌ఫోన్‌తో క్రింది QR కోడ్‌ను స్కాన్ చేసి లేదా కింది లింక్ ద్వారా స్వచ్ఛంద రక్తదాతగా నమోదు చేసుకోవచ్చు:

🔗 నమోదు కోసం: liquidlove.ssssoindia.org/liquidlove/donorRegistration

ఈరోజు మీ నమోదు…

రేపు ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశంగా మారవచ్చు!

రండి… చేతులు కలుపుదాం!

రక్తం పంచుదాం!

ప్రాణాలను కాపాడుదాం!

“లిక్విడ్ లవ్”ను ఒక మహత్తర మానవతా ఉద్యమంగా మారుద్దాం! ❤️

*దయ చేసి QR కోడ్ కుడా ప్రచురింప ప్రార్ధన* 

సదా భగవాన్ శ్రీ  సత్య సాయి భగవానుని సేవలో

K. సత్యనారాయణమూర్తి

జిల్లా అధ్యక్షులు

శ్రీ సత్య సాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్

Post a Comment

0 Comments