విశాఖపట్నం, 5 సెప్టెంబర్ 2026: సెయింట్ జోసెఫ్స్ కళాశాల ఫర్ ఉమెన్ (అటానమస్), విశాఖపట్నంలో స్టూడెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సెప్టెంబర్ 1 నుండి 5 వరకు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి.వేడుకలలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి 3 వరకు బెలూన్ స్టాంప్, ట్రెజర్ హంట్, త్రోబాల్, క్రికెట్, వంటి ఆటలు నిర్వహించగా, సెప్టెంబర్ 5న కళాశాల సెమినార్ హాల్‌లో బ్లైండ్ ఫోల్డ్ డ్రాయింగ్, విస్పర్ ఛాలెంజ్, పిక్షనరీ, వర్డ్ అంత్యాక్షరి వంటి ఇండోర్ గేమ్స్ నిర్వహించారు. అధ్యాపకులు ఎంతో ఉత్సాహంగా, క్రీడా స్ఫూర్తితో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కళాశాల ప్రాంగణంలో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజి, వైస్ ప్రిన్సిపాల్ డా. సిస్టర్ హేమ, స్టూడెంట్ కౌన్సిల్ హెడ్ డా. కెప్టెన్ కె. సుజాత, స్టూడెంట్ కౌన్సిల్ అడ్వైజర్లు సోని, సిస్టర్ నిర్మల, ప్రత్యూష, మౌసమి, ఊర్మిళ, కోటేశ్వరరావు, ప్రవీణ్, అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సెయింట్ జోసెఫ్స్ కళాశాల హోం సైన్స్ విభాగ పూర్వ హెడ్ డా. వై. లక్ష్మీ ప్రభ నెలకొల్పిన ప్రతిష్టాత్మక LSRK ఉత్తమ అధ్యాపక అవార్డు 2026 ను సెయింట్ జోసెఫ్స్ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డా. పి. భూషణవతికి అందజేశారు. ఈ అవార్డును ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజి, వైస్ ప్రిన్సిపాల్ డా. సిస్టర్ హేమ చేతుల మీదుగా ప్రదానం చేశారు.
అనంతరం అధ్యాపకులందరినీ స్టూడెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి బహుమతులు అందజేశారు. విద్యార్థినులు తమ గురువుల పట్ల ప్రేమ, గౌరవ, కృతజ్ఞతలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వ్యక్తపరిచారు.




0 Comments