అమలాపురం, విశాఖ సందేసం....జీవో 1113 ప్రకారం జరగాల్సిన ఓటర్ల సర్వే నిర్వహించలేదని, పూర్తిగా అధికార పార్టీలకు అనుకూలంగా వార్డుల రిజర్వేషన్లను చేయడం కోసం మున్సిపల్ అధికారులు వార్డులలో ఇంటింటి పర్యటన చేయకుండా, సర్వే పూర్తి చేయడం చట్ట విరుద్ధమన్నారు.
త్వరలో జరగబోవు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నది. జీవో ఎంఎస్ నెంబర్ 1113 లో ఈనెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు అధికారులు ప్రతి వార్డులోనూ పర్యటించి, పారదర్శకంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎస్సీ , ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళా ఓటర్ల సంఖ్యను లెక్కించి, ఆ నివేదిక ద్వారా వార్డుల రిజర్వేషన్స్ నిర్ణయించవలసి ఉన్నదన్నారు సర్వేకు చివరిరోజు అయినప్పటికీ వార్డులలో అధికారుల తిరిగిన దాఖలాలు లేవని, క్షేత్రస్థాయి గణాంకాలను కాదని అధికారులు కార్యాలయంలోనే కూర్చుని అధికార పార్టీ కనుసన్నలలో, వారికి అనుకూలంగా మార్చేందుకే రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేయడం నిబంధనలను పూర్తిగా విరుద్దమని వెంటనే ఈ సర్వే ని రద్దుచేసి వార్డులలో పర్యటించి ఇంటింటి సర్వే చేసి న్యాయబద్ధంగా రిజర్వేషన్లు ఖరారు చేయవలసిందిగా డిమాండ్ వంటెద్దు వెంకన్నాయుడు చేశారు

0 Comments