. SRINIVAS SPL Correspondent
అయినవిల్లి, విశాఖ సందేసం..ఆది గణపతి అయినవిల్లి ఆదిగణపతి, అయినవిల్లి వినాయక దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 14 సోమవారం నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. సత్యనారాయణ రాజుతెలిపారు. ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. సత్యనారాయణ రాజు తెలిపారు. రెవెన్యూ అధికారుల ఆదేశాలు, పోలీసుల సూచనల మేరకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులందరికీ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరంగా స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.వినాయక చవితి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు మాత్రమే ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, అన్నప్రసాదం, మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఆలయ సిబ్బందికి సహకరించి, ఏర్పాట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు తమ బంధుమిత్రులతో కలిసి పెద్ద సంఖ్యలో అయినవిల్లికి తరలివచ్చి ఆదిగణపతి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. సత్యనారాయణ రాజు కోరారు.

0 Comments