అమలాపురం, విశాఖ సందేసం...పర్యావరణ పరిరక్షణలో భాగంగా, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ అమలాపురం వశిష్ట మరియు కోనసీమ మహిళా మండలి సంయుక్తంగా భక్తులకు 700 మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ మెంబర్షిప్ కో ఆర్డినేటర్, MD-316, లయన్ శెట్ అనిల్ కుమార్ జైన్, పి ఎం జె ఎఫ్, పి ఎం సి సి మరియు ప్రత్యేక అతిథులుగా రీజియన్ చైర్‌పర్సన్ లయన్ జంపన సుమన్ వర్మ, MJF, జోన్ చైర్‌పర్సన్ లయన్ రవణం వేణుగోపాలరావు కలసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా లయన్ శెట్ అనిల్ కుమార్ జైన్ మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలకు బదులుగా ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి వినాయకుడి ప్రతిమలను పూజించాలని పిలుపునిచ్చారు. మట్టి వినాయకుల వినియోగం ద్వారా సంప్రదాయాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని పేర్కొన్నారు.
ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న రీజియన్ చైర్‌పర్సన్ లయన్ జంపన సుమన్ వర్మ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం లయన్స్ క్లబ్ చేపడుతున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి వినాయక ప్రతిమలను వినియోగించి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జోన్ చైర్‌పర్సన్ లయన్ రవణం వేణుగోపాలరావు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆఫ్ అమలాపురం వశిష్ట నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు మంచి సందేశం అందిస్తున్నారని పేర్కొన్నారు. “మట్టి వినాయకుడిని పూజిద్దాం… పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అమలాపురం వశిష్ట అధ్యక్షురాలు
లయన్ చిక్కాల అరుణ, కార్యదర్శి లయన్ శిష్ట లక్ష్మి దేవి, కోశాధికారి లయన్ డి పద్మ ప్రసాద్, గ్లోబల్ సర్వీస్ చైర్ పర్సన్ లయన్ మాకిరెడ్డి పూర్ణిమ, లయన్ పోలిశెట్టి అనంత లక్ష్మీ, లయన్ పంపన పద్మలత, లయన్ టీ లక్ష్మి, లయన్ మరియు కోనసీమ మహిళా మండలి అధ్యక్షురాలు సత్య కుమారి, పి. లలిత, గౌరవ అధ్యక్షురాలు అనంత లక్ష్మీ, లలిత కామేశ్వరి, పద్మావతి, అల్లూరి జ్యోతి గ్రామస్తులు పాల్గొన్నారు.


0 Comments