సాంకేతిక‌త దుర్వినియోగం కారాదు -ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉతృష్ట‌మైన‌ది

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, సెప్టెంబ‌ర్ 11:సాంకేతిక‌త దుర్వినియోగం కారాద‌ని దామోద‌రం సంజీవ‌య్య జాతీయ న్యాయ విశ్వ‌విద్యాల‌యం పూర్వ ఉప‌కుల‌ప‌తి ఆచార్య వై.స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఏయూ విద్య విభాగం ఆద్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఐదు రోజుల ఫ్యాక‌ల్టీ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం జెన‌రేటివ్ ఏఐ ఇన్ ఎడ్యుకేష‌న్ అంట్ ట్రైనింగ్‌-ఇంటిగ్రేటింగ్ మోర‌ల్ వేల్యూస్‌, ఎథిక్స్ అండ్ ఎన్.ఈ.పి 2020 ఫ‌ర్ ట్రాన్స్‌ఫ‌ర్‌మేటివ్ టీచింగ్ లెర్నింగ్ ముగింపు స‌మావేశంలో ఆయ‌న ముఖ్య అతిధిగా ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉతృష్ట‌మైన‌ద‌న్నారు. ప్ర‌తీ వ్య‌క్తి జీవితంలో పాఠ‌శాల విద్య ఎంతో కీల‌క‌మ‌ని భ‌విష్య‌త్తుకు అవ‌స‌ర‌మైన బ‌ల‌మైన పునాదులు ఇక్క‌డే ప‌డ‌తాయ‌న్నారు. మంచి పౌరుల‌ను త‌యారు చేసే కేంద్రంగా పాఠ‌శాల నిలుస్తుంద‌న్నారు. వ్యవస్థ అంతా నైతికతలు మరియు విలువల చుట్టూ తిరుగుతోంద‌న్నారు. ఉపాధ్యాయుల వృత్తి జీవితంలో నైతికతలు మరియు విలువలకు అధిక ప్రాధాన్య‌త ఇస్తూ, విద్యార్థుల‌కు వీటిని అందించే ప్ర‌య‌త్నం చేస్తార‌న్నారు.ఉపాధ్యాయుల పనితీరుకు విద్యార్థే ఉత్తమమైన తీర్పు ఇచ్చే వ్యక్తి అని,కేవలం పాఠ్యపుస్తకాల ఆధారంగానే కాకుండా మీ అనుభవం ద్వారా ప్రేరణ పొందేలా మీరు నిల‌వాల‌ని సూచించారు. సాంకేతిక‌త‌ను లాభ‌దాయ‌కంగా నిలుపుకుంటూ మెరుగైన బోధ‌న జ‌ర‌పాల‌ని సూచించారు.


ఎఫ్‌.డి.పి నిర్వ‌హ‌ణ నిపుణుల ప్ర‌సంగాలు త‌దిత‌ర అంశాల‌ను క‌న్వీన‌ర్ ఆచార్య టి.షారోన్ రాజు వివ‌రించారు. ఆధునిక సాంకేతిక‌త‌ల‌ను నేటిత‌రం ఉపాధ్యాయుల‌కు చేరువ చేస్తూ, భ‌విష్య‌త్ త‌రాన్ని తీర్చిదిద్ద‌డానికి అవ‌స‌ర‌మైన నైపుణ్యాల‌ను ఈ ఐదు రోజుల శిక్ష‌ణ‌లో భాగంగా నిపుణులు అందించార‌న్నారు. కార్య‌క్ర‌మంలో మౌలానా అజాద్ నేష‌న‌ల్ ఉర్దూ విశ్వ‌విద్యాల‌యం విద్య విభాగం ఆచార్యులు ఆడం పాల్‌, ఆచార్య ఏ.నాగ హ‌నుమాన్‌, ఆచార్య సాల్మ‌న్ బెన్నీ త‌దిత‌రులు ప్ర‌సంగించారు.

Post a Comment

0 Comments