ఆంధ్రవిశ్వవిద్యాలయం, సెప్టెంబర్ 11:ప్రీ రిపబ్లిక్ డే శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన ఏయూ జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) వలంటీర్లను ఏయూ అధికారులు అభినందించారు. హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ లో జరిగే వెస్ట్ జోన్ ఎన్.ఎస్.ఎస్ ప్రీ-రిపబ్లిక్ డే క్యాంప్-2026 కు ఎంపికైన ఆంధ్ర విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం (NSS) వాలంటీర్లు అయిన డి. బుచ్చయ్యనాయుడు (AUSIB), జి. హరీష్ (MR College), రోహిత్ (GVP), ఎస్తేరు రాణి (St. Ann's), వెంకట యజ్ఞయాణి (St. Joseph's), షిమాన్ ఖాన్ (Aditya College) లను ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తన ఛాంబర్ లో అభినందించారు.
ఎంపికైన వాలంటీర్లు క్యాంపులో చురుకుగా పాల్గొని రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్-2027 కు ఎంపికై ఏయూకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతొ కీలకమని ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమాజ సేవా కార్యక్రమాలలో ముందుండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య ఎస్. హరినాథ్, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి. సింహాచలం, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ హరిణి, డాక్టర్ జి. లక్ష్మీనారాయణ, తిరుపతి రావు, ఎన్.ఎస్.ఎస్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎంపికైన వాలంటీర్లకు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి. సింహాచలం తన ఛాంబర్ లో ప్రశంసా పత్రాలను అందజేసి క్యాంప్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు.

0 Comments