విశాఖపట్నం, సెప్టెంబర్ 11: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలకు బదులుగా పర్యావరణహితమైన మట్టి వినాయక ప్రతిమలను పూజించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB), విశాఖపట్నం ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కమిషనర్ కేతన్ గార్గ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. APPCB జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శంకర్ నాయక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ డాక్టర్ పి. ముకుందరావుతో కలిసి జీవీఎంసీ ఉద్యోగులు, ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వినాయక చవితి సందర్భంగా సహజసిద్ధమైన మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని తెలిపారు. POPతో తయారుచేసిన విగ్రహాలు నీటిలో సులభంగా కరగకపోవడంతో జలవనరులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రజలు సాధ్యమైనంత వరకు మట్టి ప్రతిమలనే వినియోగించాలని సూచించారు."పర్యావరణహిత పండుగలకు ప్రజల సహకారం అవసరం"
నగరాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడంలో జీవీఎంసీ ఉద్యోగులతో పాటు ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని కమిషనర్ పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను వినియోగించడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పూజా సామగ్రి, పూలు తదితర వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జీవీఎంసీ సూచనల మేరకు బాధ్యతాయుతంగా నిర్వహించాలని కోరారు.
Solid Waste Management Rules–2026లో పొందుపరిచిన ‘Circular Economy’ భావనకు అనుగుణంగా వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం, పునర్వినియోగం, రీసైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను వినియోగించడం ద్వారా వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించి, సహజ వనరులను పరిరక్షించవచ్చని తెలిపారు.వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమల వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జీవీఎంసీ, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో APPCB జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శంకర్ నాయక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ డాక్టర్ పి. ముకుందరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య, ఇన్‌చార్జి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కృష్ణంరాజు, జీవీఎంసీ వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ.
.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments