విశాఖపట్నం, ఆగస్టు 27: విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అన్ని మౌలిక సదుపాయాలతో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని జోన్లు, వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ప్రధాన ఇంజనీర్ పి.వి.వి. సత్యనారాయణ రాజుతో కలిసి జీవీఎంసీ అభివృద్ధి కార్యక్రమాలపై ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా అన్ని జోన్ల పర్యవేక్షక ఇంజనీర్లు, కార్యనిర్వాహక ఇంజనీర్లతో ఆయా జోన్లలో ప్రస్తుతం చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అభివృద్ధిలో భాగంగా అన్ని జోన్లు, వార్డుల్లో రోడ్లు, కాలువలు, పార్కులు, వీధి దీపాలు, సెంట్రల్ మీడియన్లు, స్మశాన వాటికలు తదితర మౌలిక వసతులకు సంబంధించి అవసరమైన పనులపై క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయా పనులకు అవసరమైన నిధుల కేటాయింపునకు అవకాశం ఉన్నందున ప్రతిపాదనలను త్వరితగతిన సిద్ధం చేసి సమర్పించాలని పర్యవేక్షక ఇంజనీర్లకు సూచించారు.సమీక్షలో ముందుగా నిప్పన్ కోయి ఏజెన్సీ ప్రతినిధి గంగాధర్ నగరంలోని రోడ్లు, జంక్షన్లు, బస్ బేల అభివృద్ధికి సంబంధించి రూపొందించిన డిజైన్లు, ప్రతిపాదిత కార్యాచరణను కమిషనర్‌కు వివరించారు. అనంతరం బిలో పావర్టీ లైన్ (BPL), అబౌ పావర్టీ లైన్ (APL), 24/7 బల్క్, సెమీ బల్క్, డొమెస్టిక్, కమర్షియల్, ఇన్‌స్టిట్యూషనల్, అపార్ట్‌మెంట్ కేటగిరీలకు సంబంధించిన నీటి కనెక్షన్లు, నీటి సరఫరా చార్జీల ప్రతిపాదనలను ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ప్రతినిధి సోహన్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్‌కు వివరించారు.అనంతరం కమిషనర్ మాట్లాడుతూ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నగరంలోని ప్రతి జోన్, ప్రతి వార్డులో అవసరమైన మౌలిక వసతులను గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఇంజనీరింగ్ పనుల పర్యవేక్షణలో అసిస్టెంట్ ఇంజనీర్ల హాజరు, క్షేత్రస్థాయి విధుల నిర్వహణలో లోపాలు కనిపిస్తున్నాయని, వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు జరుగుతున్న దశ నుంచే సంబంధిత రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, పనులు పూర్తయిన తర్వాత రికార్డుల నమోదులో జాప్యం చేయరాదని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు
15వ ఆర్థిక సంఘం నిధులతో ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలను వెంటనే సమర్పించాలని, 16వ ఆర్థిక సంఘం నిధుల గ్రాంట్లను పొందేందుకు అవసరమైన ప్రతిపాదనలు, కార్యాచరణను ముందస్తుగా సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు.
అన్ని జోన్లు, వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ప్రధాన ఇంజనీర్ పి.వి.వి. సత్యనారాయణ రాజును కమిషనర్ ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో పర్యవేక్షక ఇంజనీర్లు, కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డీడీహెచ్ వాసుకి తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments