విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని :వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు ,A.V.N. కాలేజ్ డౌన్లో గల లెప్రసీ ప్రేమ సమాజంలో గలవృద్ధులకు వివేకానంద సంస్థ మహిళా సభ్యులు, ట్యూషన్ విద్యార్థులు వృద్ధులందరికీ రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
వారికి భోజనాలను కూడా సంస్థ వారు ఏర్పాటు చేశారు. వివేకానంద సంస్థ ప్రతి సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రేమ సమాజంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహిస్తుంటారు. వారికి మేమున్నామని భరోసా ఇస్తూ, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే ఈ రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సత్తిబాబు, మహిళా సభ్యులు ఉమాదేవి, భవాని, కనకమహాలక్ష్మి, పోలి తల్లి మరియు సంస్థ ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు
0 Comments