ఇసుక కొండ సత్యదేవుని సన్నిధిలో శ్రావణ పౌర్ణమి వేడుకలు!

.                   K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం: విశాఖ సందేశం వార్తా వాహిని :ఇసుక కొండ  పై వేంచేసియున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి వేడుక 28-08-2026 శుక్రవారం నాడు వైభవంగా జరిగాయి. 

శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఆలయ అర్చకులు ఫణిహారం నరసింహచార్యులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు , కుంకుమార్చనలు ఘనంగా  నిర్వహించారు. ఉదయం 4:00 గంటల నుండి వేలాది భక్తులు తరలివచ్చి నూతనంగా నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ద్వారా ధ్వజస్తంభాన్ని మ్రొక్కి అనంతరం శ్రీ రమా సహిత  సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. మూడు బ్యాచ్ లలో మొత్తం 130 దంపతలు స్వామి వారి వ్రతం చేయించుకున్నారు. వ్రతంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రం, ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు 

. ధర్మ కర్తల మండలి చైర్మన్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో 1000 భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వామి వారిని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ సీతంరాజు సుధాకర్  విశాఖ పశ్చిమ నియోజక వర్గం MLA శ్రీ గణ బాబు శ్రీ కె కె రాజు  తదితరులు దర్శించుకున్నారు. ఆలయ ఈఓ టి రాజ గోపాల్ రెడ్డి, చైర్మన్ కె సూర్య ప్రసాద్ ఆధ్వర్యంలో పౌర్ణమి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Post a Comment

0 Comments