జీవీఎంసీ అదనపు కమిషనర్ (SGSW)గా కె. రమేష్ బాధ్యతల స్వీకరణ. *జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌కు జాయినింగ్ రిపోర్టు సమర్పించిన కె. రమేష్.


విశాఖపట్నం, ఆగస్టు 31: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ (SGSW – Swarna Grama Swarna Ward)గా కె. రమేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జాయినింగ్ రిపోర్టును సమర్పించారు. అనంతరం కమిషనర్‌కు పూల మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ G.O.Rt.No.1096, తేదీ 27-08-2026 ద్వారా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అదనపు సంచాలకులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ADMA)  కె .రమేష్ 

జీవీఎంసీలో అదనపు కమిషనర్ (SGSW) గా జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కె. రమేష్‌కు కమిషనర్ కేతన్ గార్గ్ అభినందనలు తెలియజేశారు.

పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ

Post a Comment

0 Comments