శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని వివేకానంద సంస్థ వారు 3,4,5 తేదీలలో వరుసగా 3 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పలుసేవ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 3వ తేదీ మొదటి రోజు గోపూజ, సహస్ర తులసీదళ పూజా కార్యక్రమం .
4 తేదీ రెండవ రోజు ఉదయం 9 గంటలకు గాయత్రి హోమం, 108 రకాల మిఠాయిలతో నైవేద్యం. కృష్ణుడి వేషధారణ పిల్లలకు బహుమతులు అందించడం.
5 తేదీ మూడో రోజు ఉదయం 9 గంటలకు పూజ కార్యక్రమం. సాయంత్రం 4 గంటలకు కొట్టు కొట్టు కార్యక్రమం, శ్రీకృష్ణుని ఊరేగింపు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు, నామ సంకీర్తన నిర్వహించబడును.
ప్రత్యేకంగా వసుదేవుడు శ్రీకృష్ణుని సముద్ర మార్గం గుండా తీసుకు వెళుతున్న ఘట్టాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పూజా కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.

0 Comments