శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం * ​ సింహాచల క్షేత్రంలో వైభవంగా కళావేదికపై కనువిందు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన

 


సింహాచలం:5 సెప్టెంబర్ 2026 ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి., భక్తుల జయజయధ్వానాలతో సింహగిరి ఆధ్యాత్మిక శోభతో పునీతమైంది.భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లోత్సవాన్ని విజయవంతం చేశారు.

సాయంత్రం స్వామివారి దేవస్థానం కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సింహగిరి భక్తజనులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి. సాయంత్రం 5:00 గంటల నుండి 7:00 గంటల వరకు గుడివాడకు చెందిన ప్రఖ్యాత "శ్రీ శివ జ్యోతి నృత్యాలయ" బృందం వారిచే ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన చూపరులను మంత్రముగ్ధులను చేసింది.స్వామివారి వైభవం, లీలలను ప్రతిబింబించే కీర్తనలకు కళాకారులు చేసిన లయబద్ధమైన పాదవిన్యాసాలు, భావయుక్తమైన అభినయాలు భక్తులను పరవశింపజేశాయి. కళాకారుల ప్రతిభకు ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది.

ఈ సాంస్కృతిక సాయంత్రం అనంతరం అద్భుతమైన ప్రదర్శనతో అలరించిన నృత్య కళాకారులను, నిర్వాహకులను దేవస్థాన అధికారులు, సత్కరించి, శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన  భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు.

Post a Comment

0 Comments