ఎస్కోకోట నియోజకవర్గం: ఎస్.కోట నియోజకవర్గ పరిధిలోని దబ్బిరాజుపేట గ్రామంలో జనసేన పార్టీ s. కోట నియోజకవర్గం నాయకులు శ్రీ బోగి రమణ గారి సారథ్యంలో యువనేత సానాపతి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ గర్జన సమావేశానికి జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సాదరంగా ఆహ్వానించి, పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజాసేవ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఈ భారీ చేరిక నిదర్శనమని అన్నారు. జనసేన సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు మరింత ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి కోసం యువత ముందుండాలని పిలుపునిచ్చారు.
జనసేన పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రతి కుటుంబానికి పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.కోట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ భోగి రమణ, స్థానిక జనసేన పార్టీ సీనియర్ నాయకులు సుంకరి అప్పారావు,జొన్నపల్లి సత్తిబాబు, కోలా కన్నయ్యదొర,గొరపల్లి రవికుమార్,,అఖండ వర్మ,తొండవరపు అప్పలరాజు,గోకేడ సంతోష్, రుద్ర నాయుడు, దువ్వార ఈశ్వరరావు,, దొరబాబు, కోలా మధు, అరిగి సన్యాసిరావు,ఎర్నిబాబు,వీరామహిళలు, జనసైనికులు, యువత,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments