విశాఖపట్నం:రోజు అనగా తేది 27.08.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి అధ్యక్షతన ART, సరోగసి బృందం తో కలిసి మేడ్సి హాస్పిటల్ & ఐవిఎఫ్ సెంటర్ (ART లెవెల్-2) హెల్త్ సిటి, విశాఖపట్నం, శ్రీ విశ్వ ఫెర్తిలిటి సెంటర్ (ART లెవెల్-2) సిరిపురం, విశాఖపట్నం సరోగసి కేంద్రము రెన్యువల్ కొరకు దరఖాస్తు చేసుకున్న వైజాగ్ ఐవిఎఫ్ సెంటర్ ను తనిఖీ చేసారు. ఈ తనిఖీ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డా.పి.జగదీశ్వర రావు వారు సదరు కేంద్రముల వారికి పలు సూచనలు చేసారు.
ఆపరేషన్ థియేటర్, వార్డ్, స్కానింగ్ మెషిన్ తనిఖీ చేసారు. ఈ పై ఆసుపత్రులు ART కేంద్రముల నిర్వహణకు అనుమతులు కలవో లేవో అని డాక్టర్స్, స్టాఫ్ యొక్క విద్యార్హతలు, ల్యాబ్ పరికరములు పరిశీలించి తగు సలహాలు ఇచ్చారు. ఈ కేంద్రములలో పేదవారికి కూడా ఫీజు తగ్గించి తీసుకోవాలని కోరారు.
ఈ తనిఖీ బృందం లో డా.విద్యారమ, గైనకాలజిస్ట్, VGH, డా.సుష్మ, రేడియోలజిస్ట్, KGH, శ్రీ కె.శివాజీ, మానిటరింగ్ కన్సల్టెంట్, డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ, శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో, మొదలగు సభ్యులు పాల్గొన్నారు.
సం./- డా.పి.జగదీశ్వర రావు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం
0 Comments