జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 27.08.2026


ఈరోజు అనగా తేదీ 27.08.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు తోటగరువు పట్టణ ఆరోగ్య కేంద్రమును సందర్శించి వైద్య ఆరోగ్య సిబ్బందిని సమీక్షించారు. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ మరియు ఎల్.జి.ఎస్., లు అందుబాటులో లేనందున మరియు పరిసరాలు పరిశుభ్రంగా లేనందున వైద్యాధికారి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట పబ్లిక్ పెర్సప్షన్, కె.పి.ఐ. ఇండికేటర్స్, ఇ.హెచ్.ఆర్., అభ ఐడి రిజిస్ట్రేషన్, ఆర్.బి.ఎస్.కె సేవలు, ఓపి, ఐపి సేవలు, ల్యాబ్ టెస్ట్ లు, మందులు లభ్యత, ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. పట్టణ ఆరోగ్య కేంద్ర పరిసర ప్రాంతములు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. 

ఈ సందర్శనలో శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో మరియు పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.  

               జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

                           విశాఖపట్నం


          

Post a Comment

0 Comments