ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆగష్టు 22:ఆంధ్ర విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి విద్యార్థి సదస్సు 'యాక్సెస్ - 2K26’ పోస్టర్‌ను ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ఆవిష్కరించారు.
భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి సందర్భంగా, 59వ ఇంజనీర్స్ డే పురస్కరించుకుని సివిల్ ఇంజనీరింగ్ సింపోజియంను సెప్టెంబర్ 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. కార్యక్రమలో భాగంగా పేపర్ ప్రెజెంటేషన్ , మోడల్ మేకింగ్ , టెక్నికల్ క్విజ్ , జామ్, ట్రెజర్ హంట్ నిర్వహిస్తారు.
సివిల్ ఇంజనీరింగ్ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక మార్పులు, పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు వసతి సదుపాయం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగధిపతి ప్రొఫెసర్ సి.ఎన్.వి. సత్యనారాయణ రెడ్డి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ ఐ. శివ పార్వతి, ప్రొఫెసర్ కె. రాజశేఖర్ మరియు విద్యార్థి కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

0 Comments