విశాఖపట్నం, ఆగస్టు 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 90 వినతులు వచ్చాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు ఎస్.ఎస్.వర్మ, డి.వి. రమణమూర్తి లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 90 అర్జీలు / ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా మధురవాడ జోన్ కు 17, ఈస్ట్ జోన్ కు 24, వెస్ట్ జోన్ కు 02, నార్త్ జోనుకు 09, సౌత్ జోన్ కు 07, పెందుర్తి జోన్ కు 07, అగనంపూడి జోన్ కు 01, గాజువాక జోన్ కు 11, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 12 ఫిర్యాదులు అందాయని తెలిపారు. జోనల్ అడ్మినిస్ట్రేషన్ కు 06, జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 04, రెవెన్యూ విభాగమునకు 11, ప్రజారోగ్య విభాగమునకు 08, పట్టణ ప్రణాళిక విభాగమునకు 37, ఇంజినీరింగు విభాగమునకు 21, డిడిహెచ్ విభాగమునకు 02, యుసిడి విభాగమునకు 01 కలిపి మొత్తంగా 90 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) లో సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రత్యక్షంగా సూక్ష్మ పరిశీలన జరుగుచున్నదని, ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలు/పిర్యాదులు పై అర్జీదారులతో నేరుగా సంబంధిత అధికారి సమస్యపై చర్చించి తగిన పరిష్కార చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులకు, జోనల్ కమిషనర్లుకు కమిషనర్ ఆదేశించారు.
ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ ఫిర్యాదులను అదే రోజు జోనల్ స్థాయి అధికారులు వెంటనే పరిశీలిస్తూ, సంబంధిత ఫిర్యాదు దారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జివిఎంసి జోనల్ కమీషనర్లను, అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (అమృత్) డి.విజయ భారతి, అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, ప్రధాన ఇంజనీర్ పి.వి.వి.సత్యనారాయణ రాజు, డి సి ఆర్ ఎస్.శ్రీనివాసరావు, సీసీపీ ఏ.ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి ఇంచార్జ్ డాక్టర్ కృష్ణం రాజు, ప్రాజెక్ట్ డైరెక్టర్ (యుసిడి) బి.వి.రమణ, ఎగ్జామినర్ ఆఫ్ ఎకౌంట్స్ సి.వాసుదేవ రెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్లు, సిటీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్, యుసిడి డిపిఒ లు జి.నాగార్జునరావు, శాంత కుమారి, డిసిపి లు, ఎసిపి లు, బయాలజిస్ట్ సాంబమూర్తి, స్టాటిస్టికల్ అధికారి పి డి వి ప్రసాద్, డిడిహెచ్ వాసుకి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి.పద్మజ, ఎకౌంట్స్ ఆఫీసర్ నారాయణరావు అన్ని విభాగాల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జివిఎంసి
.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments