విశాఖపట్నం, ఆగస్టు 31: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన 13 మంది అధికారులు, ఉద్యోగులు సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కమిషనర్లు పి.ఎం. సత్యవేణి, డి.వి. రమణమూర్తి, పరిపాలనాధికారి పి. పద్మజ, జేమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు అప్పలరాజు లతో కలిసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అదనపు కమిషనర్లు మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ జీవితంలో కుటుంబంతో గడిపిన సమయం కంటే అధిక సమయాన్ని సంస్థకు కేటాయిస్తూ ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. జీవీఎంసీ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఏదో ఒక వ్యాపకంతో కుటుంబ సభ్యులతో ఆనందంగా శేష జీవితం గడపాలని ఆకాంక్షించారు.పదవీ విరమణ పొందిన వారిలో కార్యనిర్వాహక ఇంజనీర్ పి. శ్రీనివాస్ ప్రసాద్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ జి. విజయకుమార్, టీపీఆర్వో కె. రజినీకుమారి, అకౌంట్స్ ఆఫీసర్ కె. పైడిరాజు, రెవెన్యూ ఆఫీసర్ వి. అచ్చంనాయుడు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పి. రాజేంద్ర కుమార్ రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పి. వెంకటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ ఎన్. అప్పారావు, రికార్డు అసిస్టెంట్ జె. తౌడు, మజ్దూర్ సీహెచ్. అప్పలనాయుడు, ప్రజారోగ్య కార్మికులు ఆదినారాయణ, వెంకటేశ్వరరావు, విజయ ఉన్నారు.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మొత్తం రూ.1,21,79,186 ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని అందజేశారు. అనంతరం వారిని పూలమాలలు, నూతన వస్త్రాలు, జ్ఞాపికలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యు సి డి - ప్రాజెక్ట్ ఆఫీసర్ సూర్య కుమారి, స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ.అప్పలరాజు, జెమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అప్పలరాజు, పర్యవేక్షకులు సన్నీ, జీవీఎంసీ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.గమనిక: పదవీ విరమణ పొందిన ఉద్యోగుల జాబితా ఈ పత్రికా ప్రకటనకు జతపరచడమైనది.
పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ









0 Comments