ఆంధ్ర విశ్వవిద్యాలయం,ఆగస్టు 31: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం వ్యాయామ విద్య ఆచార్యునిగా సేవలందించిన ఆచార్య ఎన్. విజయమోహన్ ఉద్యోగ విరమణ సందర్భంగా సోమవారం కోదండరామయ్య సెమినార్ హాల్లో ఘన సత్కారం నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యాయామ విద్యా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విభాగాధిపతి ఆచార్య ఎ. పల్లవి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య పి. కింగ్ విశ్వవిద్యాలయం తరఫున ఆచార్య ఎన్.విజయమోహన్‌ను ఘనంగా సత్కరించి, ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిద్యాలయంలో వ్యాయామ విద్య, క్రీడల అభివృద్ధికి ఆయన అందించిన సేవలను కొనియాడారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, విశాఖ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవీజీఆర్ నాయుడు (గణబాబు) మాట్లాడుతూ ఆచార్య విజయమోహన్ క్రీడల అభివృద్ధికి విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్కేటింగ్‌తో పాటు వివిధ క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా విశాఖ నగరానికి, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు.ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, క్రీడాకారులకు అవసరమైన సహకారం అందిస్తూ, ఎంతో సమయస్ఫూర్తితో వివిధ క్రీడా కార్యక్రమాలను నిర్వహించిన ఘనత ఆచార్య విజయమోహన్‌కు దక్కుతుందని అన్నారు. ఆయన సేవలు క్రీడా రంగానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు పూర్వ వైస్ ఛాన్సలర్లు, ఆచార్యులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు ఆచార్య విజయమోహన్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్లు ఆచార్య జి.ఎస్.ఎస్. రాజు, ఆచార్య నాగేశ్వరరావు, ఆచార్య బీల సత్యనారాయణ, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే రామునాయుడు, విశాఖ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ టి.ఎస్.ఆర్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఆచార్య వి.ఎస్. అవధాని, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జాలాది రవి, లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సీతామాణిక్యం, ఏయూ ఔట్‌రీచ్ డీన్ ఆచార్య కె. రమాసుధ, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సూర్యనారాయణ, ఏయూ డీఓఏ డైరెక్టర్ ఆచార్య నాయుడు, ఆచార్య మునిస్వామి, ఆచార్య టీ. సారోన్ రాజు, ఏయూ సెక్యూరిటీ డీన్ ఆచార్య ఆశా ఇస్యూనియల్ రాజ్, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ఆచార్య ఎస్. హరనాధ్, ఎన్‌సీసీ అధికారి ఆచార్య ఏఎన్‌ఎం యుగంధర్ తదితరులు పాల్గొని ఆచార్య విజయమోహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధకులు, నాన్‌టీచింగ్ సిబ్బంది, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


0 Comments