అప్రమత్తతతో ప్రమాదాలను నివారించిన రైల్వే సిబ్బందికి భద్రతా అవార్డులు


విశాఖపట్నం, ఆగస్టు 31: విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తి ప్రదర్శించి సంభవించే ప్రమాదాలను నివారించడంలో కీలకంగా వ్యవహరించిన రైల్వే సిబ్బందికి విశాఖపట్నం డివిజన్, సౌత్ కోస్ట్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా భద్రతా అవార్డులను అందజేశారు.

శ్రీ ఎం. వేణుగోపాల్ రావు, సీనియర్ ట్రైన్ మేనేజర్/పాస్/విశాఖపట్నం, 31.05.2026న ట్రైన్ నం. 18529 ఎక్స్‌ప్రెస్‌లో టీఎంఆర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పీవీపీ స్టేషన్ మీదుగా రైలు వెళ్తుండగా, పక్కనున్న రైలుకు చెందిన 5వ వ్యాగన్ అడాప్టర్ స్థానభ్రంశం చెందడాన్ని గుర్తించారు. వెంటనే ఫొటోలు, వీడియోలు తీసి సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో సకాలంలో తనిఖీలు, అవసరమైన చర్యలు చేపట్టారు.

శ్రీ కుడిపూడి సతీష్, సీనియర్ ఏఎల్‌పీ/విశాఖపట్నం, 03.06.2026న షంటింగ్ విధుల్లో ఉండగా లోకో నం. 41397లో వీల్ నం. 12 వద్ద ప్రైమరీ సస్పెన్షన్‌కు చెందిన ఔటర్ హెలికల్ స్ప్రింగ్ విరిగిపోయినట్లు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఈ లోకో కోచింగ్ సర్వీసుకు కేటాయించబడిన నేపథ్యంలో ఆయన అప్రమత్తతతో సంభవించే ప్రమాదాన్ని నివారించగలిగారు.

శ్రీ ఎన్. ఉమామహేశ్వరరావు, శ్రీమతి కె. ధనలక్ష్మి, అసిస్టెంట్ (C&W)/PSA, 18.06.2026న PSA స్టేషన్‌లో ట్రైన్ నం. N/TPAK-255 (లోడ్) రోలింగ్-ఇన్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో, లోకో నుంచి 20వ వ్యాగన్‌లోని R4 వీల్‌కు హాట్ యాక్సిల్ ఉన్నట్లు గుర్తించారు. నాన్-కాంటాక్ట్ ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్‌తో యాక్సిల్ ఉష్ణోగ్రత 123.5°Cగా నమోదైంది. వెంటనే సంబంధిత వ్యాగన్‌ను విడదీసి సైడింగ్‌లో ఉంచారు.

ఈ సందర్భంగా డీఆర్‌ఎం శ్రీ లలిత్ బోహ్రా అవార్డు గ్రహీతలను అభినందిస్తూ, రైల్వే కార్యకలాపాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని, సిబ్బంది అప్రమత్తత, సమయస్ఫూర్తి, భద్రతా నిబంధనల పట్ల నిబద్ధత ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి రైల్వే ఉద్యోగి ఇదే విధమైన అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.

Post a Comment

0 Comments