అనకాపల్లి టౌన్ :తీవ్రమైన ముఖం నొప్పితో బాధపడుతున్న 35 ఏళ్ల మహిళలకు అత్యాధునిక స్పిరియోాక్టి క్ రేడియో సర్జరీ విధానంలో విజయవంతంగా చికిత్స అందించినట్లు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ వైద్యులు డాక్టర్ ఎస్ ఫని శేఖర్ తెలిపారు. ట్రై జేమినల్ న్యూరాలజీ తో బాధపడుతున్న బాధితురాలు కొంతకాలంగా తీవ్ర నొప్పితో ఇబ్బంది పడుతున్నట్టు పేర్కొన్నారు. పరిస్థితిని పూర్తిగా పరిశీలించి ఆధునిక స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా చికిత్స అందించామన్నారు. ఈ విధానంలో ప్రభావంతమైన నాడిని లక్ష్యంగా చేసుకొని అత్యంత ఖచ్చితత్వంతో రేడియేషన్ నించమని వివరించారు. చికిత్స అనంతరం బాధితురాలకు ముఖంలో తీవ్రమైన నొప్పి గణనీయంగా తగ్గినట్టు తెలిపారు. ఈ విధానం ద్వారా శాస్త్ర చికిత్స లేకుండా నొప్పి నుంచి ఉపశమనం కల్పించవచ్చని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ సాయి శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

0 Comments