ఏయూ విద్యార్థులకు క్రీడామైధానాలు, జిమ్నాజియం అభివృద్ధి చేయాలి


ఆంధ్ర విశ్వవిద్యాలయం:ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చదువు తున్న విద్యార్థులకు అధునాతన క్రీడా మైదానాలు అభివృద్ధి చేయాలని ఏయూ వైస్ ఛాన్సలర్ అచార్య జీ.పీ. రాజశేఖర్ సూచించారు. మంగళవారం ఏయూ పరిపాలన భవనం సమావేశ మందిరంలో వైస్ ఛాన్సలర్ అధ్యక్షతన స్పోర్ట్స్ బోర్డు వార్షిక సమావేశం జరిగింది. ఈసందర్భంగా వైస్ చాన్సలర్ అచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనే విధంగా జిమ్నాజియంలతోపాటు మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. 

శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తిని కొనసాగిస్తూ క్యాంపస్ లో క్రీడలు నిర్వహించాలని, అనుబంధ కళాశాలలు, క్యాంపస్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఉద్యోగులుకు క్రీడలు నిర్వహించాలని డైరెక్టర్ ఆచార్య ఎన్. విజయమోహన్ కు తెలియజేసారు. నూతన క్రీడామైధానాలు అభివృద్ధి చేసేందుకు క్యాంపస్ లో స్థలం వినియోగించుకోవాలన్నారు. ప్రతిభసాదించిన క్రీడాకాలకు నగదు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖేలో ఇండియా ప్రతిపాదనలను త్వరిత గతిన ఆచరణలో పెట్టాలని సూచించారు.

ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య ఎన్ విజయమోహన్ మాట్లాడుతూ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యాయ కళాశాల, ఆర్ట్స్ కళాశాల తదితర కళాశాలల విద్యార్థులకు క్రీడలు నిర్వహించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామాన్నారు. సౌత్ ఇండియా యూనివర్శిటీ, ఆల్ ఇండియా యూనివర్శిటి క్రీడల్లో ప్రతిభ సాధించిన క్రీడా కారులకు  స్పోర్ట్స్ కిట్, టీ ఏ,డి.ఎ ఇచ్చి క్రీడల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసామన్నారు. యూనివర్శిటి క్రీడలకు 80 క్రీడాంశాల్లో   మహిళలు, పురుషుల విభాగంలో పాల్గొంటున్నారన్నారు. ఈస మావేశంలో స్పోర్ట్స్ బోర్డు లో 2026 - 27 క్రీడా బడ్జెట్ ఆమోదం తెలిపారు. ఈసందర్భంగా హాజరైన ఫిజికల్ డైరెక్టర్లు, ప్రిన్సిపల్ లను అనుబంధ కళాశాలలో క్రీడా నదుపాయాల కల్పన పై  వీసీ అడిగి తెలుసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్, స్పోర్ట్స్ బోర్డు కోశాధికారి, ఆచార్య కె. రాంబాబు, వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య  కళాశాల పిడి డాక్టర్ బి.ఆర్.ఎస్.ఎల్ లక్ష్మణరెడ్డి, ఐఐపీఈ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. వెంకటేశ్వరరావు, జి.వి.పి కొమ్మాది  పి డి ఎన్. మంగళగౌరీ, ఎవి ఎన్ కళాశాల వ్యాయామ విద్యా విభాగం పి డి డాక్టర్ ఎస్. గోపీకృష్ణ, అరకు గవర్నమెంట్ డిగ్రీ కళాశా పి డి ఎస్. అప్పారావు, పీడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments