శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచల క్షేత్రంలో రెండు రోజుల పాటు వైభవంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు.

 


సింహాచలం: 27 ఆగస్టు 2026.శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు కళా వైభవాన్ని అందించేందుకు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాజగోపురం పక్కన గల కళావేదికపై రెండు రోజుల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్య నిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రముఖ కళా బృందాలు కూచిపూడి నృత్య ప్రదర్శనల ద్వారా భక్తులను, కళాభిమానులను అలరించనున్నాయి.

 29 ఆగస్టు 2026 – శనివారం

 కూచిపూడి నృత్య ప్రదర్శన

శ్రీ భక్తి ప్రహ్లాద కూచిపూడి కళా బృందం వారిచే, రాజమహేంద్రవరం

సాయంత్రం 5:00 గంటల నుంచి 7:00 గంటల వరకు

30 ఆగస్టు 2026 – ఆదివారం

కూచిపూడి నృత్య ప్రదర్శన

శ్రీ సిద్ధివినాయక నాట్యాలయం, కళా బృందం  మధురవాడ, విశాఖపట్నం వారిచే 

సాయంత్రం 5:00 గంటల నుంచి 7:00 గంటల వరకు

సింహాచల క్షేత్రాన్ని సందర్శించే భక్తులు, కళాభిమానులు రాజగోపురం పక్కన గల కళావేదిక వద్ద ఈ రెండు రోజుల సాంస్కృతిక కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని కూచిపూడి నృత్య ప్రదర్శనలను వీక్షించి కళాకారులను ప్రోత్సహించాలని దేవస్థానం అధికారులు కోరారు.

స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మికతకు కళా వైభవం తోడై భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించనుంది.

Post a Comment

0 Comments