విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు ఆదివారం విశాఖ నగరానికి విచ్చేసి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా విశాఖ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సుబ్బారెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు రవి రెడ్డి, కట్టమూరి సతీష్, శరగడం చిన్నప్ప నాయుడు, కొండ రాజీవ్ గాంధీ, మంచా నాగమల్లేశ్వరి, కిరణ్ రాజు, అంబటి సెలీష్, బోండా ఉమా, పీలా ప్రేమ్, మనోజ్, భవాని శంకర్, గాలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments