వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారు, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు గారు కలిసి ఈరోజు పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్.ఈ.సి. సభ్యులు శ్రీ ఐ.హెచ్. ఫారూక్ గారి కుమార్తెకు ఇటీవల వివాహం జరిగిన సందర్భంగా వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం A1 గ్రాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మొల్లి అప్పారావు గారి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అలాగే విజయనగరం జిల్లా సుంకరిపేట గ్రామంలో శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారి ఢిల్లీ పీఏ శ్రీ విజయ్ కుమార్ గారి ఇటీవల జరిగిన వివాహం సందర్భంగా వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ కట్టుమూరి సతీష్ గారు, పార్టీ కార్యాలయం పర్యవేక్షుకులు రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

0 Comments