శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర రావు.


 సింహాచలం, ఆగస్టు 26, 2026:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ తర్లాడ రాజశేఖర రావు బుధవారం సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయానికి విచ్చేసిన గౌరవ న్యాయమూర్తికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది నాదస్వరం, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం గౌరవ న్యాయమూర్తి ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, ఆలయ గర్భాలయంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ వేద పండితులు జస్టిస్ తర్లాడ రాజశేఖర రావుకు వేదాశీర్వచనం అందజేశారు.

ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీ జల్లేపల్లి వెంకట్రావు గౌరవ న్యాయమూర్తికి శేషవస్త్రం కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను అందజేసి, స్వామివారి దివ్య చిత్రపటాన్ని జ్ఞాపికగా బహూకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments