గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపుమేరకు విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం ఆధ్వర్యంలో విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
అసెంబ్లీ సందర్శన అనంతరం విద్యార్థులు సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సందర్శనలో తమకు కలిగిన అనుభవాలను ఉపకులపతితో పంచుకున్నారు. శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థులకు ఇలాంటి విద్యాపరమైన అనుభవాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఉపకులపతి పేర్కొన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు.

0 Comments