శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. శ్రీ స్వామివారిని దర్శించుకున్న ఛత్తీస్‌గఢ్ మాజీ కేబినెట్ మంత్రి, ఎంపీ శ్రీ బృజ్‌మోహన్ అగర్వాల్

 


సింహాచలం, ఆగస్టు 22, 2026:శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రమైన సింహాచలాన్ని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ మాజీ కేబినెట్ మంత్రి శ్రీ బృజ్‌మోహన్ అగర్వాల్ శనివారం సందర్శించి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా దేవస్థానం ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీ రామజోగారావు ఆయనకు ఆలయ మర్యాదలతో  స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయబద్ధంగా కప్పస్తం మాలింగనం నిర్వహించిన తరువాత శ్రీ స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు.


శ్రీ స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున శ్రీ బృజ్‌మోహన్ అగర్వాల్‌కు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి,  ప్రసాదాలను అందజేశారు.


ఈ సందర్భంగా శ్రీ బృజ్‌మోహన్ అగర్వాల్ స్వామివారి దర్శనం పట్ల సంతోషం వ్యక్తం చేసి, సింహాచల క్షేత్ర ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రశంసించారు.

Post a Comment

0 Comments