అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌లో భార‌త్ ముందంజ‌


 ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, ఆగ‌ష్టు 25 :ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల (ఏ) జియో-ఇంజినీరింగ్‌ విభాగంలో విద్యార్థి సంఘం ఉర్వికృతి ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


 ఈ సందర్భంగా విభాగాధిపతి ప్రొఫెసర్‌ జగదీశ్వరరావు మాట్లాడుతూ చంద్రయాన్‌, ఆదిత్య-ఎల్‌1 వంటి ప్రయోగాలతో భారతదేశం అంతరిక్ష రంగంలో విశేష విజయాలు సాధించిందన్నారు.


 ఉపగ్రహ డేటా, జీఐఎస్‌, జియో-ఇన్ఫర్మాటిక్స్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు అంతరిక్ష పరిశోధనలకు కీలకంగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. విక్రమ్‌ సారాభాయ్‌, ఏ.పి.జె. అబ్దుల్‌ కలాం వంటి శాస్త్రవేత్తల సేవలను ఆయన స్మరించారు.


విద్యార్థులు రూపొందించిన రాకెట్‌, స్పేస్‌ గ్రౌండ్‌ స్టేషన్‌ నమూనాలు, ప్రత్యేక జాతీయ అంతరిక్ష దినోత్సవ పోస్టర్‌ కార్యక్రమంలో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వరల్డ్‌ స్పేస్‌ వీక్‌ (WSW) 2026 ఏడాది కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు.యువతలో అంతరిక్ష శాస్త్రం, ఉపగ్రహ సాంకేతికత, భూ పరిశీలన, జియో-ఇన్ఫర్మాటిక్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు ఉర్వికృతి చేస్తున్న కృషిని అభినందించారు.

Post a Comment

0 Comments